పేదల ఇళ్ల జోలికి వస్తే సహించేది లేదు

నిజాంపట్నం: పేదల నివాసాల జోలికి  వస్తే సహించేది లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు హెచ్చరించారు. గోకర్ణమఠం గ్రామానికి చెందిన పలువురు మహిళలు మంగళవారం నిజాంపట్నంలోని మోపిదేవి నివాసంలో ఆయనను కలిసి తమ సమస్యను వివరించారు. గోకర్ణమఠం గ్రామంలోని గొకర్ణేశ్వర స్వామి ఆలయానికి చెందిన స్థలంలో గత 60 సంవత్సరాల నుంచి 34 కుటుంబాలు జీవిస్తున్నారు. అయితే ఇటీవల ఎండోమెంట్‌ అధికారులు ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన మోపిదేవి అధికారుల తీరును తప్పుపట్టారు. ఎప్పటి నుంచో గృహాలు కట్టుకుని నివసిస్తున్న పేదల ఇళ్లను ఖాళీ చేయమని ఎండోమెంట్‌ అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఎండోమెంట్‌ అధికారులు ప్రభుత్వ ధర ప్రకారం పేదల నుంచి నగదును కట్టించుకుని ఆ పేదలకు పూర్తిస్థాయిలో స్థలాన్ని అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Back to Top