ఏపీ శాసనసభకు సంబంధించిన ఇంఛార్జ్ కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి సహా ఉన్నతాధికారుల విద్యార్హతలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా... సామాన్యులను ప్రభుత్వం ఇబ్బంది పాలు జేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శాసనసభలోనూ, వెలుపల అధికారుల ద్వారా సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వెలిబుచ్చారు. శాసనసభలో కార్యదర్శులు, డిప్యూటీ కార్యదర్శులు ఏవిధంగా పనిచేస్తున్నారో దీని ద్వారా స్పష్టవుతోందన్నారు. <br/>టెన్త్ నుంచి డిగ్రీ వరకు, న్యాయశాస్త్రానికి సంబంధించిన పట్టా ఎప్పుడు పొందారన్న దానిపై ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారం అడిగినట్లు ఆర్కే పేర్కొన్నారు. 2015 నవంబర్ లో ఓసారి, ఫిబ్రవరిలో మరోసారి అడిగినట్లు తెలిపారు. ఆర్టీఐ చట్టం ప్రకారం నెలరోజుల్లో సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి సమాచారం అందివ్వలేదని ఫైర్ అయ్యారు. <br/>సమాచార హక్కు చట్టం కింద అందజేయాల్సిన పత్రాలను 7,8 నెలలుగా ఇవ్వకపోకపోవడంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, కమిషనర్ ను ఆశ్రయించామన్నారు. తద్వారా సమాచార కమిషన్ ముందు హాజరవ్వాలని ఏపీ శాసనసభ పీఐవోకి నోటీసులు వెళ్లాయన్నారు. ఈసారైనా సమాచారం ఇస్తారని ఆశిస్తున్నామన్నారు.