బాబు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

అనంతపురం : మాజీ ఎంపీ, వైయస్సార్సీపీ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని విమర్శించారు.

కదిరి పట్టణంలోని వైయస్సార్సీపీ నాయకుడు సిద్ధారెడ్డికి చెందిన ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ అనుమతులను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడబోమని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. 
Back to Top