మూడేళ్లలో ఒక్క ఇటుక కూడా వేయలేదు

ఏపీ అసెంబ్లీ: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి మూడేళ్ల వ్యవధిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. శనివారం ఏపీ అసెంబ్లీలో అమరావతి నిర్మాణంపై చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ జగన్‌ హాజరు కాలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడేళ్లలో ఒక్క ఇటుక కూడా వేయని ముఖ్యమంత్రి, ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పుడు మరో డ్రామా ఆడుతున్నారని, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌తో వచ్చే లాభం ఏమి లేదని విమర్శించారు. మరో గంట సభా సమయం వృథా చేయడమే అని అభిప్రాయపడ్డారు.

Back to Top