ఒక్క బోరు కూడా వేయించలేదు

ఏపీ అసెంబ్లీ: మా నియోజకవర్గంలో 1500 బోర్లు వేయిస్తామన్న మంత్రులు రెండేళ్లు అవుతున్నా ఒక్క బోరు కూడా వేయించలేదని ఎమ్మెల్యే కళావతి విమర్శించారు. శనివారం మీడియా పాయింట్లో ఆమె ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఏ మాత్రం ఆదుకోవడం లేదు. వాయిదా తీర్మానాన్ని అడ్డుకోవడం దారుణం. ఎన్నికల సమయంలో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులు 80 శాతం ఉన్నా కూడా ధరల స్థిరీకరణ గురించి పట్టించుకోకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. పాలకొండ నియోజకవర్గంలో రెండు సంవత్సరాలుగా రెండు మండలాలనుకరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఆ సమయంలో కలెక్టర్‌ చేత ప్రకటన చేయించారు. కరువు మండలాల్లో ఎన్‌టీఆర్‌ జలసిరి పథకం కింద 1500 బోర్లు వేయిస్తామని మంత్రులు చెప్పారు. ఇప్పటి వరకు  ఒక్క బోరు కూడా తీయించలేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ జాబితాను పచ్చ చొక్కాల ఇళ్లలో కూర్చోని రాశారు. అందరికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వమంటున్నారు. గత రెండేళ్లుగా నీలం తూపాన్, హుద్‌హుద్‌ తుపాన్, ఫైలాన్‌ తుపాన్‌ సమయంలో కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించలేదు. దానికి సభలో సమాధానం అడిగితే కూడా చెప్పడం లేదు.గిరిజన ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారు. కేజీ రూ.40 అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

తాజా వీడియోలు

Back to Top