ప్యాకేజీలతో సీమాంధ్రుల మనోభావాలను కొనలేరు

హైదరాబాద్, 11 ఆగస్టు 2013 :

ప్యాకేజీలు ఇచ్చి సమైక్యవాదుల మనోభావాలను కొనలేరని వైయస్ఆర్ కాంగ్రెస్ ‌పార్టీ ఎమ్మెల్యే ప్రవీ‌ణ్కుమా‌ర్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎపిఎన్జీవో భవనంలో ఆదివానం ఏర్పాటు చేసిన సమైక్యవాదుల సమ్మేళనంలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి సీమాంధ్రులను మెడ పట్టి బయటకు నెట్టే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‌ఈ తీరు తీవ్ర అశాంతికి దారి తీస్తుందని హెచ్చరించారు. వేర్పాటు ఉద్యమాలను అణిచివేయాలని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సూచించారు.

తాజా ఫోటోలు

Back to Top