పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా..?

అనంతపురం: తుంగభద్ర ఎగువ కాలువకు ఈసారి అన్యాయం జరిగిందని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.  అనంతపురం జిల్లాలోని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ను ప‌రిశీలించిన అనంత‌రం ఆయ‌న స్థానిక విలేకరుల‌తో మాట్లాడుతూ.... పంటలు ఎండిపోతున్నా అధికార స‌ర్కార్ పట్టించుకోవడం లేదని మండిప‌డ్డారు. హంద్రీనీవా నీటిని తుంగభద్ర ఎగువ కాలువకు మళ్లించి వెంటనే జిల్లాలోని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


కృష్ణా, గోదావరి నదుల నుంచి ప్రతి యేటా 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయని రాప్తాడు వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త తోపుదుర్ది ప్రకాశ్రెడ్డి వెల్లడించారు. అనంతపురానికి 100 టీఎంసీల నీరు తరలిస్తే... కరువు నివారించవచ్చు అని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


Back to Top