గుక్కెడు నీళ్లు ఇవ్వని మీరా మాట్లాడేది..!రైతుల వద్ద తేల్చుకుందాం రా..!కృష్ణా పక్కనే కాపురముంటూ రైతులను పట్టించుకోని అసమర్థ సీఎం..!<br/>విజయవాడః వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చంద్రబాబు, దేవినేని ఉమలపై నిప్పులు చెరిగారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను తిట్టడమే పనిగా చంద్రబాబు నీకు ఇరిగేషన్ శాఖ ఇచ్చాడా అని దేవినేనిపై మండిపడ్డారు. కృష్ణాజిల్లా వాసిగా ఇరిగేషన్ మంత్రై ఉండి డెల్టా రైతులకు నీరు ఇవ్వలేని దద్దమ్మ దేవినేని ఉమ అని రమేష్ నిప్పులు చెరిగారు. కష్ణా డెల్టాకు నీరు ఇవ్వలేని నీవు రాయలసీమను రతనాల సీమ చేస్తానని మాట్లాడ్డం హాస్యాస్పదమన్నారు. రైతులకు సాగునీరు కాదు కదా గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వని మీరు వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తారా అంటూ పచ్చనేతలను ఏకిపారేశారు. <br/>నోరు జాగ్రత్త..!దేవినేనికి దమ్ము ధైర్యం ఉంటే తమతో పాటు కృష్ణాడెల్టాకు వచ్చి మాట్లాడాలని జోగి రమేష్ సవాల్ విసిరారు. రైతులు ఎవరి చెంప పగలగొడతారో అప్పుడు తేలుతుందన్నారు. కృష్ణాడెల్టా వద్దే కాపురం ఉంటూ రైతులను ఏమాత్రం పట్టించుకోని అమసర్థ సీఎం చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. పట్టిసీమ పేరుతో కోట్ల రూపాయలు నొక్కేసిన మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాప ప్రక్షాళన చేసుకోవాలని మాట్లాడాతారా అంటూ దేవినేనిపై రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరిని ప్రక్షాళన చేస్తారో రైతుల వద్దకు వెళ్లి తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. నోరు అదుపులో పెట్టుకోవాలని దేవినేనిని హెచ్చరించారు. <br/>చేతగాని దద్మమ్మలు..!నీళ్లు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని మీ ఎమ్మెల్యే వెంకట్రావే అంటున్నారని...ఆయనకు సమాధానం చెప్పుకోలేని సిగ్గులేని మంత్రులు మీరు అంటూ చంద్రబాబు, దేవినేనిపై రమేష్ మండిపడ్డారు. మంత్రులంతా చేతగాని దద్మమ్మలుగా మగిలిపోయారన్నారు. పవర్ అంతా లోకేష్ చేతిలో పెట్టి మమ్ముల్ని దద్దమ్మలను చేశారని మంత్రులే చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. శంకుస్థాపన పేరుతో కోట్లాది రూపాయలు దుబారా చేసి ..ఢిల్లీ నుంచి మోడీ, కుప్పం నుంచి బాబు మట్టి తెచ్చి ప్రజల నోట్లో మట్టికొట్టారని రమేష్ విమర్శించారు.