అవిశ్వాస తీర్మానానికి స‌హ‌క‌రించండి


అమ‌రావ‌తి: పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మానానికి స‌హ‌క‌రించాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని పార్టీల‌కు ట్విట్ట‌ర్ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు. ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంగా నాడు పార్ల‌మెంట్‌లో ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పార‌ని, నేటికీ ఇవ్వ‌క పోవ‌డం వ‌ల్లే ఆందోళ‌న‌లు చేయాల్సి వ‌స్తోంద‌ని పేర్కొన్నారు. ఇత‌ర పార్టీల స‌మ‌స్య‌లను కూడా అర్థం చేసుకున్నామ‌ని కానీ ఏపీకి ప్ర‌త్యేక హోదా జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య అని పేర్కొన్నారు. ఆటంకం లేకుండా అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రిగేలా స‌హ‌క‌రించాల‌ని కోరారు. ప్ర‌త్యేక హోదా వ‌చ్చే వ‌ర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. 
Back to Top