కళ్లెదుటే అన్యాయం..అడిగే నాథుడే కరువయ్యాడు

తెలంగాణ ప్రభుత్వం కళ్లెదుటే ఏపీకి అన్యాయం చేస్తున్నా అడిగే నాథుడే కరవయ్యాడని ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు.  కృష్ణా, గోదావరి నదులపై కేసీఆర్ అడ్డగోలుగా ఇష్టమొచ్చినట్లు ప్రాజెక్ట్ లు కడుతుంటే.... చంద్రబాబు కనీసం నిలదీసేందుకు కూడా ముందుకు రాకపోవడం దారుణమన్నారు.  దిగువకు నీళ్లు రాకపోతే పరిస్థితి ఏమిటన్న ఆలోచన కూడా టీడీపీకి లేకపోవడం బాధాకరమన్నారు.

శ్రీశైలం జలాశయంలో 854 అడుగులుంటేనే రాయలసీమలోని ప్రాజెక్ట్ లకు కాస్తో కూస్తో నీరందే పరిస్థితి ఉంటుందన్నారు. కానీ  800 అడుగులుండగానే ఏకంగా 120 టీఎంసీల నీటిని తీసుకుపోతే ...కిందికి నీళ్లు ఎలా వస్తాయని కేసీఆర్, చంద్రబాబులను జననేత నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి పథకాల పేరుతో  కేసీఆర్ రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేస్తున్నా...అడగాల్సిన స్థితిలో ఉండి కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top