ప్రజల్ని పట్టించుకోని మంత్రివర్గం :అంబటి రాంబాబు

హైదరాబాద్) రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోకుండా మంత్రి వర్గ సమావేశం జరిగిందని
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభిప్రాయ పడ్డారు. మంత్రి వర్గ
నిర్ణయాల్లోని డొల్లతనాన్ని ఆయన ఆధారాలతో సహా బయట పెట్టారు. కరువు, తాగునీటి
ఎద్దడి సమస్యల్ని అధిగమించేందుకు నిర్మాణాత్మక చర్యలు లేవని స్పష్టం చేశారు.
మజ్జిగ పంపిణీ చంద్రబాబు కుమారుడు లోకేస్ కు మేలు కల్పించే పని, హెరిటేజ్ అమ్మకాల
కోసం ఉద్దేశించిందని పేర్కొన్నారు.  రాజధాని ప్రాంతాల్లో ప్రజల అవసరాలు ఏమాత్రం
పట్టించుకోవటం లేదని చెప్పారు. మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల ప్రక్రియ హాస్యాస్పదంగా
ఉందని అంబటి అభివర్ణించారు. 

Back to Top