నేడు అవిశ్వాసతీర్మానం నోటీసు

హైదరాబాద్) శాసనసభలో స్పీకర్ పక్షపాత వైఖరికి
నిరసనగా నేడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు
ఇవ్వనున్నారు. ఇందుకు గాను నిన్న జరిగిన వైఎస్సార్సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా
తీర్మానం చేయటం జరిగింది. పార్టీ అధ్యక్షులు, శాసనసభ పక్ష నాయకుడు వైఎస్ జగన్
అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఇందుకు అనుగుణంగా శాసనసభ కార్యదర్శి కి ఈ మేరకు నోటీసు
అందచేయనున్నారు. రాజ్యాంగం,    అసెంబ్లీ నియమావళి
ప్రకారం నోటీసు అందిన తర్వాత అవిశ్వాస తీర్మానం మీద చర్చ కోసం సమావేశాలు ఏర్పాటు
చేయాల్సిన అవసరం ఉంది.

 

Back to Top