జ‌గ‌న్‌ను విమ‌ర్శించే స్థాయి వారికి లేదు

గుంటూరు:  వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అభివృద్ధికి అడ్డు ప‌డుతున్నార‌ని మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు, టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు ఆంజ‌నేయులు అవాకులు చెవాకులు పేలటం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు మ‌ర్రి రాజశేఖ‌ర్ ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను విమ‌ర్శించే స్థాయి వారికి లేద‌ని, వారు చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. రెండున్న‌రేళ్లలో చంద్రబాబు స‌ర్కార్ చేసిన అభివృద్ధి ఏమీ లేద‌ని రాజ‌శేఖ‌ర్ ఆరోపించారు. త‌న కుటుంబ కార్య‌క్ర‌మంలా రాజ‌ధాని భూమిపూజ చేసిన సీఎం చంద్ర‌బాబు రూ. 400 కోట్ల‌తో ప్ర‌ధాని మోదీని పిలిచి మ‌రీ... శంకుస్థాప‌న చేశార‌ని, దీనిపై ఏ కోర్టు స్టే లేక‌పోయినా ఎందుకు నిలిచిపోయింద‌ని ఆయ‌న నిల‌దీశారు.   ఆయా నియోజ‌క‌వ‌ర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు క‌ప్పం వ‌సూళ్లు చేస్తుంటే ప‌రిశ్ర‌మ‌లు పెట్టేందుకు ఎవ‌రు ముందుకు వ‌స్తార‌ని ప్ర‌శ్నించారు.  న‌కిలీ విత్తనాల‌ను ఆరిక‌ట్ట‌డంలో   ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ అన్నారు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ప్ర‌తిపాటి పుల్లారావు క‌నుస‌న్న‌ల్లోనే జిల్లాలో న‌కిలీ విత్త‌నాల వ్యాపారం య‌థేచ్చ‌గా సాగుతోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 

తాజా ఫోటోలు

Back to Top