టీడీపీ హ‌యంలో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువు

నగరి:రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టక మహిళా ప్రజాప్రతినిధులకు భద్రత లేదని మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీయూసీ ప్రధాన కార్యదర్శి కేజే కుమార్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా న‌గ‌రి లో ఏర్పాటు చేసిన‌ విలేకరుల సమావేశం లో మాట్లాడా రు. మున్సిపల్ పరిధిలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు చైర్ పర్సన్‌కు ఉంటుందనే విచక్షణ జ్ఞానం  లేని ఎమ్మె ల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అనుచరులతో తనపైనా, వైఎస్‌ఆర్ సీపీ నేతలపైనా దాడి చేయించిన తీరుపై పట్టణ ప్రజలు చీకొడుతున్నారన్నారు. దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన అమృత్‌రాజ్, అతని సోదరుడు మైఖేల్ బియ్యం స్మగ్లింగ్, నకిలీ మద్యం తయారీలో నిందితులని, అలాంటి  నేరస్తులకు ఆశ్రయం కల్పించి, దాడి చేయిస్తున్నది  ముద్దుకృష్ణమనాయుడేనని, అది తెలియక ఆయన కుమారుడు భానుప్రకాష్  క్రమశిక్షణపై మాట్లాడటం సిగ్గుచేటుగా ఉం దని చెప్పారు.  
  మొన్న నగరి జాతరలో ఎమ్మెల్యే ఆర్కే రోజా, నిన్న మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతిపై చేసిన దాడులు చూస్తుంటే టీడీపీ పాలన, క్రమ శిక్షణ అర్థమవుతుందన్నారు.  ఐదు రోజుల పాటూ కఠినంగా దీక్ష చేయడంతో అనారోగ్యానికి గురైన చైర్‌పర్సన్ శాంతికి ఏప్రిల్ 4న చెన్నై అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారని, ఆపరేషన్ జరిగిన మూడు నెలలకే టీడీపీ గుండాలు, స్మగ్లరతో ఎమ్మెల్సీ ముద్దు దాడి చేయించి, పోలీసులు చూస్తుండగానే కడుపులో మోకాలితో పొడవడం తెలుగుదేశం ప్రభుత్వ తీ రుకు అద్దం పడుతోందన్నారు. మునిసిపల్ వైస్ చైర్మన్ పీజీ నీలమేఘం, నాయకులు బుజ్జిరెడ్డి, కృష్ణమూర్తి, అయ్యప్పన్, తెరణి సర్పంచ్ రవి, ఆనందకుమార్,  మురగన్, గోవర్ధన్, శేఖర్ పాల్గొన్నారు. 
Back to Top