రాష్ట్రంలో చట్టం లేదు...న్యాయంలేదు

రాష్ట్రంలో చట్టం లేదు...న్యాయంలేదు
ఫిరాయింపు దారులపై వేటు వేయరు
అవినీతితో అడ్డంగా దొరికినా పదవులను వీడరు
చంద్రబాబు తీరుపై వైయస్ జగన్ మండిపాటు

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 23 రోజన పాదయాత్ర చేస్తూ శుక్రవారం సాయంత్రం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పత్తి కొండ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. వేలాది మంది ఇక్కడకు వచ్చి ప్రజాసంకల్పయాత్రకు మద్దతు తెలుపుతున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
 చెరగని చిరునవ్వుతో ఆప్యాయతను, ఆత్మీయతను చూపించారు. ప్రతి అవ్వకు, తాతకు, సోదరుడికి, అక్కకు, చెల్లెకు ప్రేమానురాగాలను చూపించిన ప్రతి ఒక్కరికీ కృత‌జ్ఞతలు  నాలుగేళ్ల బాబు పాలన చూశాక.. ఇన్ని మోసాలు, అబద్ధాలు ఆడే ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదు. నాలుగేళ్ల  గతాన్ని గుర్తు చేసుకుంటే.. చంద్రబాబు పాలనలో వైఫల్యాలు అన్నీఇన్నీకావు.  బాబు పాలన చూశాక మనకు ఎలాంటి నాయకత్వం కావాలో ఆలోచించాలి.  మోసం చేసేవారు, అబద్ధాలు చెప్పేవారు నాయకుడిగా కావాలా? అని సూటిగా అడిగారు. 

ఆ సభలో  వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే...

ఈ రాష్ట్రంలో చట్టం లేదు. న్యాయం లేదు. పశువులు కొంటున్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారుని  ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయరు, వారిపై వేటు వేయరని మండిపడ్డారు. పట్టపగలు చంద్రబాబు తను సంపాదించిన అవినీతి సొమ్ములో నుంచి రూ.20-30 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే అడిగే నాధుడు లేని పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్లిపోతోందన్నారు. ఇదే చంద్రబాబు ఓ ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ వీడియో-ఆడియో టేపుల్లో దొరికిపోతే రాజీనామా చేయరు.  పదవి నుంచి తప్పుకోరు. జైలుకు కూడా పోరని.. ఇలాంటి పరిస్థితిలోకి మన వ్యవస్థ వెళ్లిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 గ్రామంలో పింఛన్లు, మరుగుదొడ్లు, ఇసుక నుంచి ప్రతి ఒక్కదానిని  అవినీతి మయం చేశారని ఆరోపించారు.తాను పత్తికొండకు  వచ్చేముందు.. చదువుకుంటున్న విద్యార్థులు తనవద్దకు వచ్చారన్నారు. కనీసం మూత్శాశాలలు కూడా లేని జడ్పీ స్కూల్ ఒక్కసారి చూడండంటూ  వ్యంగ్యంగా మంత్రులనుద్దేశించి అన్నారు. మాట్లాడితే స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటారని ఎద్దేవా చేశారు. మోడల్ స్కూళ్లు  అంటారు. 6 నెలల నుంచి టీచర్లకు  జీతాలు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. ఇందుకు ప్రధాన  కారణం.. నారాయణ సంస్థకు చంద్రబాబు బినామీ కావడమే అన్నారు . 
 బాబుకు హెరిటేజ్ పుడ్ అనే సంస్థ ఉందనీ, అక్కడ దొరికే ప్రతి వస్తువూ రైతుల నుంచి తీసుకునేవే అన్నారు. తన హెరిటేజ్ సంస్థ కోసం చంద్రబాబు దళారీ అయి.. రైతుల్ని అమ్మేసే పరిస్థితి వచ్చిందన్నారు. పత్తిపంటకు రేటు ఉందా అని  ప్రశ్నించారు. వేరుశెనగ రేటు క్వింటాలుకు రూ.2,000-2,500 ఉందన్నారు. కంది రేటు రూ.3000 ఉందన్నారు. ఈ రోజు కంది, పత్తి, మినుము.. ఇలా ఏపంటను తీసుకున్నా గిట్టుబాటు ధర లేదన్నారు. రైతు దగ్గర ఉన్నప్పుడు రేట్లు ఉండవన్నారు. చంద్రబాబు దళారీ వ్యవస్థను నడుపుతున్నారని  మండిపడ్డారు. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలుచేస్తే , దళారీల వద్దకు వెళ్తే రేట్లు మండిపోతున్నాయన్నారు.  నాలుగేళ్ల బాబు పాలన మనమంతా చూస్తున్నామని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి కాకమునుపు.. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని అన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ రోజు కరెంటు బిల్లు రూ.500, రూ.1000 వస్తోందన్నారు. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయన్నారు. రేట్లు విపరీతంగా పెంచటమే కాకుండా ప్రత్యేకంగా అధికారులను  ఇంటింటికీ పంపుతూ . రూ.20వేలు కరెంటు బిల్లు కట్టండని పెనాల్టీ వేసి పోతున్నారన్నారు.  

 చంద్రబాబు పాలన కన్నా ముందు..  రేషన్ షాపుకు వెళ్తే 9 రకాల వస్తువులు ఇచ్చేవారన్నారు. బాబు వచ్చాక బియ్యం తప్ప రేషన్ షాపుల్లో ఏవీ ఇవ్వటం లేదన్నారు. బియ్యం కూడా వేలిముద్రలు పడటం లేదని ఎగరగొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు వచ్చి ప్రతి పేదవాడికీ మూడు సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికీ ఇళ్లు కట్టిస్తానని అన్న సంగతిని గుర్తు చేస్తూ, గ్రామంలో ఏ ఒక్కరికైనా ఇవి అందాయా అని జగన్ మోహన్ రెడ్డి  ప్రజల్ని అడిగారు.  దీనికి సమాధానంగా ప్రజలు లేదంటూ చేతులూపారు.జాబు రావాలంటే.. బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రెండువేల నిరుద్యోగ భ)తి ఇస్తామన్నారు. 45 నెలలు బాబు పరిపాలన చేశారు. ఇంటింటికీ రెండు వేలు చొప్పన లెక్కేస్తే ప్రతి ఇంటికీ 90వేలు బాబు బాకీ పడ్డారన్నారు. నాలుగేళ్ల క్రితం బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. వ్యవసాయ రుణాలన్నీ బేషరుతుగా మాఫీ కావాలంటే బాబు రావాలన్నారు. నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా.. బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చిందా ప్రతిపక్ష నేత  ప్రశ్నించారు. బంగారం రాలేదు కానీ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయన్నారు.

 అప్పట్లో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా పొదుపుసంఘల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా అని ప్రశ్నిస్తే లేదని సమాధానం వచ్చింది. 
ప్రత్యేక హోదా సంజీవని అన్న చంద్రబాబు అది తేకపోగా.. రాజకీయ వ్యవస్థలను దిగజార్చి కుంటిసాకులు చెపుతున్నారని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు.  చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా అని మనసాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు.

క్రిష్ణగిరి రిజర్వాయర్ పనులు పూర్తి చేయరెందుకు ?

పత్తికొండ నియోజకవర్గంలో.. క్రిష్ణగిరి రిజర్వాయర్ కోసం వైయస్ఆర్ హయాంలోనే నిధులు కేటాయించి 85% పనులు పూర్తి చేశారు. మిగిలిపోయిన 15% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వాటినీ పూర్తి చేయని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ నియోజకవర్గంలో నీటి సమస్యలపై సెస్ ఇచ్చిన నివేదికలో అట్టడుగున ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఇక్కడ టమోటాలు ఎక్కువగా పండిస్తారని గిట్టుబాటు ధర రాలేక రైతులు పంటను రోడ్ల మీద పారేస్తున్నారన్నారు. చంద్రబాబు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతానని హామీ ఇచ్చారని అదెక్కడ అని ప్రతిపక్ష నేత ప్రశ్నించారు. ఇక్కడ బీసీ హాస్టల్ పెట్టండని డిమాండ్ ఉంటే.. ఉన్నవాటిలో 6 మూసేశారన్నారు. ఎస్సీ, బీసీ హాస్టళ్లు ఈ నియోజకవర్గంలో మూసేశారన్నారు. 

క్లస్టర్ స్కూల్స్ అంటూ ఉన్న స్కూళ్లన్నిటినీ మూసేస్తున్నారన్నారు. అన్నా.. 5 కి.మీ స్కూల్స్ కోసం వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారన్నారు. ఎక్కడ చూసిన పాఠశాలలను మూసేస్తున్నారు. టీచర్లకు జీతాలు ఇవ్వటం లేదని అన్న ఫిర్యాదులే వస్తున్నాయన్నారు  రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యాన్ని తీసుకువచ్చేందుకు 3వేల కి.మీ పాదయాత్ర చేపట్టానన్నారు. ఈ యాత్రలో మీ సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. నవరత్నాల్లో మెరుగు పరచటానికి సలహాలు, సూచనలు ఇవ్వమని  కోరారు. 

నవరత్నాల్లో అమ్మఒడి గురించి.. 
రేపు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అందరికీ మేలు చేస్తామని జననేత వైయస్ జగన్ పునరుద్ఘాటించారు. బీసీల మీద ప్రేమ కేవలం దివంగత నేత వైయస్ఆర్ మాత్రమే చూపించారన్నారు. చంద్రబాబు మాత్రం బీసీలకు కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి విద్యార్థి ఏం చదువుతామంటే అది చదవిస్తామని  భరోసాగా ఉన్నారన్నారు. చదువు కోసం ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన పని లేదని ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తీసుకు వచ్చారని . ఇంజనీరింగ్ ఫీజులు చదవాలంటే లక్షకు పైనే ఫీజులు ఉన్నాయన్నారు. చంద్రబాబు పాలన వచ్చిందని .. ఇంజనీరింగ్ ఫీజులు చూస్తే.. లక్ష దాటుతున్నా.. బాబు కేవలం రూ.30, 35వేలే  ఇస్తున్నారని శ్రీ జగన్ తెలిపారు. .ఇంజనీరింగ్ చదువులు చదవాలంటే మిగిలిన 70వేలు ఆ తల్లిదండ్రులు ఎక్కడ నుంచి తెస్తారని జగన్ ప్రశ్నించారు. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని.. ఆయన ఒక అడుగు వేస్తే.. తాను మరో రెండు అడుగులు ముందుకు వేస్తున్నానని.. మీ పిల్లలు ఏం చదువుతారో.. వారిని తను చదివిస్తానని పిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. విద్యార్థులు చదవటానికి దూర ప్రాంతాలు వెళ్లాల్సి వస్తుందని.. వారి మెస్ ఛార్జీలకు కూడా తనే ఇస్తానని.. తినటానికి 24వేలు ఇస్తామని ప్రకటించారు.

అవ్వాతాతలకు అండగా..

అవ్వాతాతలకు.. వయస్సు పెరిగే కొద్దీ మందులు కూడా కావాలి. కానీ అవ్వాతాతల గురించి పట్టించుకునే పరిస్థితిలేదన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం రేట్లు పెంచుతారు. అదే అవ్వాతాతలకు పింఛను పెంచరని తెలిపారు. పింఛను రేపు రూ.2వేలు ఇస్తామన్నారు. అట్టడుగు, బలహీన వర్గాలకు పింఛను వయస్సు 45కే తగ్గిస్తామన్నారు. దీనివల్ల చాలా మందికి మేలు జరుగుతుందన్నారు. ప్రతిపేదవాడికీ ఇళ్లు కట్టిస్తానని  హామీ ఇచ్చారు. . పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కూడా జగన్ హామీ ఇచ్చారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటికి అప్పులు ఎంత ఉంటాయో.. నాలుగు దఫాలుగా మీ చేతికే ఇస్తామన్నారు. ప్రతి అక్కాచెల్లెమ్మకు ఇది నామాట అంటూ విస్పష్టంగా చెప్పరు. 

పోలవరంపై.. 

కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ బాబుకు లేఖ రాశారు. ఈ లేఖ ఎలాగూ ప్రజలు చూడరు కదా.. అని ఉన్నది లేనట్లుగా చంద్రబాబు చెప్పారు. దీన్ని కొన్ని ఛానల్స్ మీడియా బాబుకు బజాయింపు చేశాయని ఎద్దేవా చేశారు. ఈ లేఖలో టెండర్లును ప్రశ్నించారన్నారు. ఈ టెండర్లు పిలిచిన దాంట్లో మూడు వారాలు కూడా టైం ఇవ్వలేదు.. 45 రోజుల కన్నా తక్కువ టైం ఇస్తే రూల్సు ఒప్పుకోవని లేఖ రాశారన్నారు. ఇచ్చిందే తక్కువ రోజులు. టెండర్లలో అందరూ పాల్గొనాలంటే.. ఈ ప్రొక్యూర్ మెంట్ సైట్ లో 22 తేదీ నాటికి టెండర్ లేదని లేఖలో కేంద్రం తెలిపిందన్నారు. ఈ లేఖను చంద్రబాబు రకరకాలుగా మాయచేసి.. మాట్లాడారన్నారు. పోలవరంలో తనకిష్టమైన వారిని సబ్ కాంట్రాక్టర్లుగా తీసుకువచ్చారన్నారు. 16వేల కోట్ల ప్రాజెక్టును రూ.58 వేల కోట్లుగా పెంచటంతో కేంద్ర ప్రభుత్వం కూడా భయపడుతోందన్నారు. పోలవరంపై  ఇంత దారుణాలు జరుగుతుంటే చంద్రబాబు అనుకూలమైన పేపర్లు, టీవీల్లో ఢాకా బజాయిస్తారన్నారు. ఇంత దారుణమైన వ్యవస్థలో మార్పు తీసుకురావటానికి  ప్రజలంతా కదిలి రావాలని, మీ బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. 

శ్రీదేవమ్మను ఆదరించండి...

పత్తికొండలో  ప్రత్యేక పరిస్థితుల్లో హత్యలు చేసి.. వ్యక్తిని తీసేస్తే.. పార్టీ పోతుందనే దుర్భద్దితో వ్యవహరిస్తే ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులు శ్రీదేవమ్మ మన పార్టీ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించినట్లు చెప్పారు. నారాయణ రెడ్డి అన్నకు ఇవ్వాల్సిన మెజార్టీకి రెండింతలు ఇవ్వండని వైయస్ జగన్ తెలిపారు. ప్రజలు ఎవర్ని అయితే దీవిస్తారో వారు నాయకుడు అవుతారన్నారు. దీవించండి.. ఆశీర్వదించడని పేరుపేరునా కోరారు.


Back to Top