బడ్జెట్ లో అన్ని వర్గాలకు మొండిచేయి

ప్రకాశంః రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అంకెల గారడీ గా ఉందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని, మహిళలకు మొండిచేయి చూపారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గాయని చెప్పిన ప్రభుత్వం వ్యవసాయ వృద్ధి పెరిగిందని ఎలా చెబుతోందని ప్రశ్నించారు. జిల్లాలో తాగు, సాగునీటికి ప్రాధాన్యం ఉన్న వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం రూ. 200 కోట్లు  కేటాయించడం దారుణమన్నారు.

కనీసం మొదటి దశ పూర్తి చేయాలన్నా వెయ్యి కోట్లు కావాలన్నారు. రుణమాఫీకి సంబంధించి 3,512 కోట్ల రూపాయల కేటాయింపు కనీసం వడ్డీ చెల్లించడానికి కూడా సరిపోదన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా ఏమీ చేయలేదన్నారు. జిల్లాలో శిల్పారామం, యూనివర్శిటీ ఆఫ్ మినరల్ సెన్సైస్‌కు ఎటువంటి కేటాయింపులు లేకపోవడం దారుణమన్నారు. జిల్లాలో పాడిపరిశ్రమ, ఒంగోలు జాతి అభివృద్ధికి అవసరమైన వెటర్నరీ యూనివర్శిటీ ప్రస్తావన లేదన్నారు. ప్రజలకు అర్థం కాకుండా ఉండేందుకు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇంగ్లిషులో చదవడం బాధాకరమన్నారు.

Back to Top