రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంది

విశాఖపట్టణం:  రాష్ట్రంలో  మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని న‌గ‌రి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. టీడీపీ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు సాధికారిత కాదు కాదా క‌నీసం ప‌ర‌ప‌తి కూడాలేద‌న్నారు. చ‌దువుల స‌ర‌స్వ‌తి రిషితేశ్వ‌రిని ర్యాగింగ్ పేరుతో ఆత్మ‌హ‌త్య చేసుకునే విధంగా చేసిన ప్రిన్సిపాల్‌ను కాపాడ‌టంమేనా మ‌హిళా సాధికారిత అంటే..అని ప్ర‌శ్నించారు. విశాఖపట్టణంలో ఆదివారం నాడు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 
చింత‌మ‌నేని ఇసుక‌దోపిడిని సీనియ‌ర్ అధికారి వ‌న‌జాక్షి అడ్డుకుంటే  ఆమెను ఇంటికి పిలిచి తిట్టి ఆవ‌మానించార‌న్నారు.  విజ‌య‌వాడ న‌గ‌ర న‌డిబొడ్డున కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్ పేరుతో ఎంతో మంది మ‌హిళ ల జీవితాల‌ను నాశ‌నం చేసిన కొంద‌రు టీడీపీ నేత‌లు కేసులో ఉన్నార‌ని వాటిని నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తుంద్నారు.  దానిపై అసెంబ్లీపై నిల‌దీసినందుకు న‌న్ను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సెస్పెండ్ చేయ‌డం చేశార‌న్నారు. అంగ‌న్‌వాడీలు జీతాలు కోసం పోరాడితే సూదుల‌తో చేతుల్లో గుచ్చుతార‌న్నారు. మెస్ ఛార్జీలు కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులు పోరాడితే పోలీసుల‌తో బూట్ కాలితో త‌న్నిస్తార‌న్నారు. తుందుర్రులో ఆక్వా ఫుడ్ పెడితే త‌మ జీవితాలు నాశ‌నం అవుతాయ‌ని ధ‌ర్నా చేస్తే మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా  త‌ప్పుడు కేసులు  బ‌నాయించి, బ‌ట్ట‌లు చిరిగిపోతున్నాయ‌ని కూడా చూడ‌కుండా ఎత్తి వ్యానులో ప‌డేవేయడం ఎంత‌వ‌రుకు స‌మంజసం అన్నారు.  బ్రిటీషు వారి ప‌రిపాల‌నలో కూడా  మ‌హిళ లు ఇంత‌గా వేధింపులు చూడ‌లేద‌న్నారు.  నారావారి న‌ర‌కాసుర పాల‌న‌లో మ‌హిళ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు.  5 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వ‌రకు, చివ‌రికి మ‌తిస్థిమితం లేని మ‌హిళ‌పై కూడా అత్యాచారానికి పాల్పడుతున్న  ప‌రిస్థితులు ఉన్నాయంటే చంద్ర‌బాబు ఎంత‌చేత‌గాని ద‌ద్ద‌మ్మ ముఖ్య‌మంత్రో తేట‌తెల్ల‌మ‌వుతోంద‌న్నారు. మ‌హిళా వ్య‌తిరేకి అయిన చంద్ర‌బాబును గ‌ద్దె దించాల‌న్నారు. ప్ర‌తి చెల్లి టీడీపీని త‌రిమికొట్టాల‌న్నారు. బాలిక‌ల‌పై అత్యాచారాలు జ‌రుగుతున్న ఈ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డంలేద‌న్నారు. త‌న పాల‌న‌లో మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు జ‌రిగితే ఆయ‌న ర్యాలీలు నిర్వ‌హిస్తార‌ని, త‌ప్పులు క‌ప్పిపుచ్చుకోవ‌డానికి దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తార‌న్నారు. నాలుగేళ్లు బీజేపీతో  క‌లిసి దోపిడీ అంతా చేసేసి బీజేపీతో ప‌ని అయిపోయింద‌ని  ఇక బీజీపీతో  ఓట్లు రావ‌నే ఉద్దేశ్యంతో కుయుక్తులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.  
Back to Top