దళితుల సంక్షేమం పేపర్లకే పరిమితం..అంబేద్కర్ మెడలో దండవేసే అర్హత కూడా చంద్రబాబుకు లేదు.వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగనాగార్జున
విజయవాడః దళిత సంక్షేమం పేపర్ ప్రకటనలకే పరిమితమయిందని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరగ నాగార్జున మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో దళితులకు మేలు చేశాం అని సీఎం చంద్రబాబు, మంత్రి నక్క ఆనంద్‌బాబులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దళితులకు ఏం చేసిందో గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు.దళిత సంక్షేమం కేవలం పత్రిక ప్రకటనకే పరిమితమయ్యింది తప్ప ఎక్కడా కాన రావడంలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు, ఆనంద్‌బాబు పత్రికలో పెద్దపెద్ద ప్రకటనలు ఇస్తున్నారని, ప్రజల సొమ్ముతో ఇస్తున్న ప్రకటనలు ఎవరికి పనికి వస్తున్నాయని ప్రశ్నించారు.
దళిత సంక్షేమ, అభివృద్ధి చెప్పే చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లలో దళితులకు ఏమి చేశారో చెప్పాలన్నారు. ఏపీలో ఇప్పటికి దళితుల వివక్ష కొనసాగుతుందన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలోనే అసమానతలు చోటుచేసుకుంటన్నాయని, చంద్రబాబు సీఎం అయిన తర్వాత దాడులు జరుగుతున్నాయన్నారు. దళితులపై దాడుల్లో నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం భారతదేశంలోనే ఏపీ నాలుగవ స్థానంలో ఉందన్నారు. దళితుల మీద ఏవిధంగా దాడులు జరుగుతున్నాయో తెలియడంలేదా అని దుయ్యబట్టారు.
దెందులూరు ఎమ్మెల్యే దళితులకు దాడిచేస్తే చంద్రబాబుకు కనిపించదు. దళితులను భూములను లాక్కుంటే చంద్రబాబుకు మాట్లాడరు..అసైన్‌మెంట్ భూములను భయపెట్టి లాక్కుంటే చంద్రబాబు నాయుడు మౌనవ వహిస్తారు. దళితుల మహిళల మీద దాడులు జరిగి అఘాయిత్యాలు జరుగుతున్నా కనిపించదు నేషనల్ ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఇన్వాల్ అయినా మాట్లాడరు. దళితులకు భద్రత ఎక్కడ ఉంది అని చంద్రబాబును ప్రశ్నించారు. దళిత సంక్షేమానికి పూర్తిగా చంద్రబాబు తూట్లు పోడిచారని విమర్శించారు. దళితులపై దాడులు అరికట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు తాగడానికి నీరు, ఉండటానికి ఇళ్లు, ఆరోగ్యం, సదుపాయాలు వంటి సమస్యలపై పట్టించుకోలేదన్నారు. కరెంటు లేక చీకటిలో బతుకుతున్నారన్నారు. స్వాతంత్ర దేశంలో దళిత గిరిజనుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు.ఇప్పటికే డోల్లెలలో కట్టుకుని ఆసుపత్రికి వెళ్ళేపరిస్థితి ఉందన్నారు.
దళిత సంక్షేమం అంటే టీడీపీ దొంగ సంక్షేమం అని, దళితులను అడ్డంపెట్టుకుని టీడీపీ లాభపడిందన్నారు.దళితుల సబ్‌ప్లాన్ నిధులను తెలుగుదేశం పార్టీ కొల్లగొడుతుందన్నారు. రాష్ట్రంలో దళితులకు సంబంధించి సబ్ ప్లాన్ నిధులు ఎంత ఖర్చు పెట్టావో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. నిధుల ఖర్చుపై చెప్పగలిగే ధైర్యం,దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు 92.7 ఖర్చుచేసామని దళిత మంత్రి చెప్పుతున్నారని ఎంత పర్సెంటేజీ ఏవిధంగా ఖర్చుపెట్టారో చెప్ప గలుగుతారా సమాధానం చెప్పాలన్నారు.
అంబేద్కర్‌కు మెడలో దండవేసే అర్హత కూడా చంద్రబాబుకు లేదు. అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం, విగ్రహం కాని ఇప్పటి దాకా ఎందుకు పెట్టలేకపోయావు. విగ్రహాలు పెట్టడానికి ప్రజాభ్రిపాయం సేకరణ చేయాలా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా దళితులను మోసం చేయాడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఉమ్మడి ఏపీలో బిల్‌క్లింటన్ వస్తే హైదరాబాద్‌లోని బిక్షాగాళ్లను బయటపేడేశాడంట.. ఇలాంటి ముఖ్యమంత్రి వస్తాడనే అంబేద్కర్ దళితులకు హక్కులను కల్పించారన్నారు.లేకపోతే దళితులను కూడా చంద్రబాబు అలానే చేస్తాడన్నారు.
దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల మీద పెట్టుకుని పరిపాలన చేశాన్నారు.నాలుగున్నర సంవత్సరాల్లో 3,179 ఎకరాలను చంద్రబాబు పంచితే.. రాజశేఖర్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో 32 లక్షల ఎకరాలు పెంచారు.. చంద్రబాబు పాలనలో దళితుల సంక్షేమం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు,వైయస్‌ఆర్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో పైకి వచ్చాం.చంద్రబాబు వేసే కుక్కబిస్కెట్లకు పనిచేయొద్దని చంద్రబాబు వద్ద ఉన్న దళితులకు సోదరులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు దళితులను కరివేపాకులా వాడి పక్కన పడేస్తాడు..అవసరమైతే ప్రత్యర్థి పార్టీల మీద ఉసిగొల్పుతాడు తప్ప దళితులకు ఉపయోగపడడు అని 30 ఏళ్లు అనుభవం ఉన్న నాయకుడు మోత్కుపల్లి నర్సింహం చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబును నమ్మొద్దని, చంద్రబాబుకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. వైయస్‌ఆర్ దళితులకు దాదాపు 25 లక్షల ఇళ్లు కట్టించారని, చంద్రబాబు దళితులకు ఎన్ని ఇళ్లు కట్టించారని ప్రశ్నించారు. దళితులను గౌరవించే పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని, అధికారంలోకి రాగానే దళితులకు సంక్షేమం, అభివృద్ధి కృషి చేయాలనే ఆలోచనతో వైయస్ జగన్ ఉన్నారని తెలిపారు.