దళితులకు రక్షణ లేదు

చిత్తూరు:  తెలుగుదేశం పాలనలో దళితులకు రక్షణ లేదనీ, దాడులు పెరిగిపోయాయని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి లో నిర్వహించిన ఎస్సీ ల ఆత్మీయసదస్సులో ఆయన మాట్లాడారు.  పెరుగుతున్న అసమానతలు దళితుల జీవితాన్ని భారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్  జగన్‌ ముఖ్యమంత్రి అయితే దళితుల జీవితాలను నవరత్నాలతో నింపుతారన్నారు. 45 ఏళ్లకే ఫించన్‌ ప్రకటించడం స్వాగతనీయమని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌  అని చేసిన ప్రకటన ఎస్సీ ల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అలాగే ఎస్సీల జీవనోపాథి కోసం వ్యవసాయ భూములు కేటాయించాలని, చదువుకున్న  యువత అందరికీ  ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top