గోదావరి బ్రిడ్జిపై పాదయాత్రకు అనుమతి నిరాకరణ


తూర్పుగోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. గోదావరి బ్రిడ్జిపై వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పాదయాత్రకు మరో మార్గం చూసుకోవాలని రాజమండ్రి డీఎస్సీ లేఖలో పేర్కొన్నారు.  ఎక్కువ మంది బ్రిడ్జిపైకి రావడం మంచిది కాదని పోలీసులు పేర్కొన్నారు. బ్రిడ్జి కండిషన్‌ సరిగా లేదని అనుమతి నిరాకరించింది. వైయస్‌ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా నాయకులు రౌతు సూర్యప్రకాశ్‌ తదితరులు డీఎస్పీని కలిసి రూట్‌మ్యాప్‌ను అందజేశారు. ఈ నెల 12వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో కొవ్వూరు నుంచి రాజమండ్రికి వచ్చేందుకు గోదావరి బ్రిడ్జిపై అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని డీఎస్పీ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇదే బ్రిడ్జిపై పాదయాత్ర చేపట్టారు. సాధారణంగా కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నుంచే ఎవరైనా వెళ్లడానికి మొగ్గు చూపుతారు. 2003లో వైయస్‌ రాజశేఖరరెడ్డి కూడా ఇదే బ్రిడ్జిపై పాదయాత్ర చేపట్టారు. బ్రిడ్జి కండీషన్‌ లేదని అనుమతి నిరాకరించడంపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాయంత్రం జిల్లా ఎస్పీని కలువనున్నారు.
 
Back to Top