జన ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు: జోగి

విజయవాడ 17 సెప్టెంబర్ 2013:

ఎన్ని కుట్రలు పన్నినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జన ప్రభంజనాన్ని చంద్రబాబు ఆపలేరని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ స్పష్టంచేశారు.  ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ శ్రీ జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే చంద్రబాబునాయుడు వెన్నులో వణుకు పుడుతోందన్నారు.  ఆయనను ఎదుర్కొనే ధైర్యం లేకే ఢిల్లీలో చీకటి రాజకీయాలు చేస్తున్నారని  మండిపడ్డారు.  ఉదయించే సూర్యుడిని అరచేయి అడ్డుపెట్టి ఆపాలనుకోవటం అవివేకమన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top