రిషితేశ్వరిలా మరొకరి జీవితం బలికాకూడదు

‘ర్యాగింగ్ నిరోధించండి’ పోస్టర్‌ను ఆవిష్కరించిన వైయస్ జగన్
ర్యాగింగ్ ను నిరోధించే విషయమై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచన

హైదరాబాద్ : నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ కు బలైన ఇంజనీరింగ్ విద్యార్థిని రిషితేశ్వరిలా మరొకరి జీవితం బలికాకూడదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ అన్నారు. వైయస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ‘ర్యాగింగ్ నిరోధించండి’ అనే పోస్టర్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ ఆవిష్కరించారు. 

ర్యాగింగ్‌ను నిరోధించే విషయమై విస్తృతంగా ప్రచారం చేయాలని విద్యార్థి నాయకులకు వైయస్ జగన్  సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాం బాబు, ప్రధాన కార్యదర్శి రాకేష్‌రెడ్డి, కార్యదర్శి కందుల దినేష్‌రెడ్డి, సాయి ప్రతాప్‌రెడ్డి, నదీప్‌రెడ్డి, దివాకర్, యశ్వంత్, గణేష్, శంకర్‌రెడ్డి  పాల్గొన్నారు.

ఎన్నో ఆశలతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆకతాయిల ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యకు పాతరేస్తూ విద్యార్థిని జీవితాన్ని బలిగొన్న నిందితులను శిక్షించాల్సిన ప్రభుత్వమే వారికి రక్షణగా నిలవడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. చదువుల తల్లి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. కానీ, ప్రాణం తీసిన నిందితులు మాత్రం బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇది క్షమించరాని నేరమని ప్రతీ ఒక్కరూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 
Back to Top