<br/>కాకినాడ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ జడ్పీ ఛైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అవినీతి తో సంపాదించిన సొమ్ములతో కొంత మందిని ఎమ్మెల్యేలను లాక్కొంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా హైదరాబాద్ నుంచి కాకినాడ చేరుకొన్న వేణు గోపాల్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఇంటి దగ్గర కిటకిటలాడిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. కలుసుకొన్న కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాలకు ప్రలోభాలు పెట్టడం మానుకోవాలని చంద్రబాబుకి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు.