రెండేళ్ల పాలనలో అంతా శూన్యం

బాబు ప్రసంగమంతా కట్టుకథలే
లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించుకోవడం దారుణం
రాష్ట్రాన్ని నిలువునా దోచుకుతింటున్నారు
లంచాలు, కమీషన్లతో పేదలను పీక్కుతింటున్నారు

హైదరాబాద్ః చంద్రబాబు తన ప‌రిపాల‌న అవినీతి ర‌హితంగా ఉంద‌న‌డం హాస్యాస్పదమని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. అవినీతి సొమ్ముతో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా బాబు ప‌ని చేస్తున్నార‌ని మండిపడ్డారు. ఏక‌ప‌క్షంగా దోపిడి రాజ్యాన్ని న‌డుపుతున్నార‌ని ధర్మాన విమ‌ర్శించారు. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ఫైరయ్యారు. 

బాబు చేసిన గొప్ప ప‌నులు ఏమీ లేనందునే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. రైతుల‌కు రుణామాఫీ చేస్తాన‌న్న హామీ నీటి బుడ‌గ మాదిరిగా మారింద‌ని, దీంతో రైతుల‌కు బ్యాంకుల నుంచి రుణాలు అంద‌క వ‌డ్డీ వ్యాపారుల‌ను ఆశ్ర‌యించాల్సిన దుస్థితి నెల‌కొంద‌న్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. 

పాస్‌బుక్ తీసుకోవ‌డానికి వస్తున్న రైతుల వ‌ద్ద నుంచి సైతం డ‌బ్బులు వ‌సూళ్లు చేస్తున్నార‌ని మండిపడ్డారు. కేంద్రం పేదలకు కేటాయించిన నిధులను ప‌చ్చ ఎమ్మెల్యేలు దోచుకుంటుంటే.... వారిని నిల‌దీసే ద‌మ్ము కూడా బాబుకు లేకపోయిందన్నారు.  క‌మీష‌న్లు తీసుకోకుండా ప‌చ్చ త‌మ్ముళ్లు  ఏ ఒక్కపనైనా చేశారా అని ధర్మాన నిలదీశారు.  చివ‌రికి గ్రామీణ స్థాయిలో జ‌రిగిన ప‌నులు, ఫించ‌న్లలో కూడా ప‌చ్చ త‌మ్ముళ్లు క‌మీష‌న్లు తీసుకుంటున్నార‌ని ధ‌ర్మాన ఆగ్రహించారు.  జ‌న్మ‌భూమి పేరిట ఏర్పాటు చేసిన అవినీతి క‌మిటీలు లంచాలు తీసుకుంటూ పేద‌వారిని కన్నీళ్లతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. 

రెండేళ్ల పాల‌న శూన్యం
రెండేళ్ల ప‌రిపాల‌నలో  బాబు చేసిందేమీ లేదన్నారు. మిగిలిన కాలంలో పలనా కార్యక్రమాలు చేస్తామని కూడా బాబు చెప్పలేకపోయారని విమర్శించారు. బాబు ప్ర‌సంగం మొత్తం లేనివి ఉన్న‌ట్టుగా క‌ట్టుక‌థ‌లు అల్లుతూ సాగిందని ఎద్దేవా చేశారు. రోజురోజుకూ బ‌ల‌ప‌డుతూ, ప్ర‌భంజ‌నంలా మారుతున్న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని దూషించమంటూ....బాబు తన నాయకులకు, కార్య‌క‌ర్త‌ల‌కు చెప్ప‌డం సిగ్గు చేట‌న్నారు.  ప్రజాసమస్యలపైనా,  రెండేళ్లలో  వైఫల్యం చెందిన పాలనపై చర్చించకుండా లేని విష‌యాల‌ను చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. 

విద్యుత్ 24 గంట‌లు ఇచ్చాన‌ని చెబుతున్న బాబు ...ఏ రోజు 24 గంట‌లు విద్యుత్ ఇచ్చారో చెప్పాల‌ని ధర్మాన డిమాండ్ చేశారు. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, ఒరిస్సాలో మిగులు విద్యుత్ ఇస్తున్నారని...ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం బాబు విఫ‌లం చెందార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. 
ఎన్టీఆర్ గొప్ప వ్య‌క్తి మాత్ర‌మే కాద‌ని గొప్ప నిబద్ధ‌త‌ క‌లిగిన వ్య‌క్తి అని అంద‌రికీ తెలుస‌ని  ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు.  తిరుప‌తి స‌భ‌లో బాబు అర‌గంట సేపు ఏక‌ధాటిగా ఎన్టీఆర్ గురించి ప్ర‌శంసిస్తూ మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. 
Back to Top