ఉద్యోగమూ లేదు, నిరుద్యోగ భృతి లేదు

చిత్తూరుః  విద్యార్థులు, నిరుద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం వంచిస్తోందని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ నాయకులు మండిపడ్డారు.  ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల భృతి ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా పైసా ఇచ్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాబు అంటేనే దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వమని  విద్యార్థి నాయకులు తిరుపతిలో మాట్లాడుతూ మండిపడ్డారు.  ఏపరిశ్రమలోనైనా ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం ఇప్పించారా బాబు అని వారు ప్రశ్నించారు. నోటిఫికేషన్ల కోసం  ఏళ్ల తరబడి యూనివర్సిటీల్లో ఎదురుచూస్తూ...ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బాబుకు ఉద్యోగం వచ్చిందే తప్ప...బాబును నమ్మి ఓట్లేసిన తమకు మాత్రం ఉద్యోగాలు రావడం లేదని  విద్యార్థి నాయకులు వాపోయారు. నిరుద్యోగులు, విద్యార్థులు ప్రభుత్వంపై తీవ్ర అసంహనంతో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు హామీలు అమలు చేయని కారణంగానే ఇవాళ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఐనా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహించారు.
Back to Top