విదేశీ తిరుగుళ్లే తప్ప పెట్టుబడులు నిల్

విశాఖపట్నం : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు విదేశీ టూర్లు చేయడమే తప్ప... రాష్ట్రానికి పైసా పెట్టుబడి కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో బాబు విఫలమయ్యారని విమర్శించారు. బ్యూటిపికేషన్ పేరుతో ఆలయాలను తొలగించడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. దీనిపై వైయస్సార్సీపీ న్యాయ పోరాటం చేస్తుందని కొయ్య ప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top