పుష్కరం దాటినా.. ఇల్లు ఇవ్వలేదు

తూర్పుగోదావరి: పుష్కరకాలం దాటిపోయినా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనకు మంజూరు చేసిన ఇల్లును ఇప్పటి వరకు ఇవ్వలేదని రమణయ్యపేటకు చెందిన పర్వీన్‌ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన గోడు వెల్లబోసుకుంది. పెద్దాపురంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పర్వీన్‌ కలిశారు. ఈ మేరకు తన సమస్యను జననేతకు వివరించారు. 2006లో తనకు రాజీవ్‌గృహకల్ప కింద వైయస్‌ఆర్‌ ఇల్లు మంజూరు చేశారన్నారు. ఇప్పటికీ లోన్‌ కట్‌ అవుతుంది కానీ ఇల్లు మాత్రం ఇవ్వలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం తనపై వివక్ష చూపుతుందన్నారు. 12 సంవత్సరాలుగా ఇప్పటికీ రూ. 10 లక్షలు కట్టానని, ఇల్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని జననేతకు వివరించారు. 
Back to Top