జననేతను ఏ శక్తి అడ్డుకోలేదు

2019లో వైఎస్ జగన్ సీఎం అవ్వడం ఖాయం
చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు
కుట్రలు,కుతంత్రాలు, అవినీతితో..రాష్ట్రాన్ని దివాళా తీశారు
ఆనం పార్టీలో చేరడం ఎంతో శుభసూచిక
పార్టీ బలోపేతం కోసం అహర్నిషలు శ్రమిద్దాం

నెల్లూరుః  రాష్ట్రంలో తప్పుల మీద తప్పులు చేస్తూ చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. బాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. దాన్ని పుణికిపుచ్చుకొని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజానాయకులు ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ బలోపేతం కోసం కష్టపడుదామన్నారు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని మేకపాటి రాజమోహన్ రెడ్డి తేల్చిచెప్పారు. 

నెల్లూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో మేకపాటి మాట్లాడుతూ...వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ సహా ఇతర నేతలంతా  జిల్లా గౌరవాన్ని నిలిపారని చెప్పారు.  తాము ఎట్టిపరిస్థితుల్లో పొరపాటు చేయమని...ఏ చిన్న పొరపాటు చేసినా జిల్లా ప్రజలు క్షమించరన్నారు.  వైఎస్ జగన్ వెన్నంటి నడవడానికి అంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ఆనం విజయకుమార్ రెడ్డి  పార్టీలో చేరడం శుభదాయకమన్నారు. జిల్లా మెచ్చే నాయకుడు, ఎప్పటికీ గుర్తుండే నాయకుడు ఆనం సుబ్బారెడ్డి నిజమైన వారసుడిగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.  

చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు అవినీతితో రాష్ట్రాన్ని దివాళా తీశారని జిల్లా వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా  రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సామాన్యుని గురించి ఎక్కడా కూడా ఆలోచన చేయడం లేదన్నారు. టీడీపీ సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోను ఏవిధంగా కాలరాసిందో... రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త  ప్రజలకు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 

ఆనాడు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...నేడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ తప్పుల్ని, తప్పిదాల్ని, అవినీతి, అక్రమాలను ఎండగట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని, ఏ శక్తి జననేతను ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు.  

ఇదే వార్తాశం ఇంగ్లీష్
లో: http://goo.gl/7C5MBY 


Back to Top