నిధులివ్వకుండా అభివృద్ధి ఎలా చేస్తారు బాబు..?

విశాఖ: ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శించారు.  విశాఖకు నిధులు ఇవ్వకుండా కేంద్ర బడ్జెట్ ఏ విధంగా నిరాశపర్చిందో.. అదే రీతిలో రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు. నిధులు లేకుండా విమ్స్ ను ఎలా అభివృద్ది చేస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాజెక్టులకు రూపాయి కూడా కేటాయించక పోవడం దురదృష్టకరమన్నారు.

సుజల స్రవంతికి రూ. 10 వేల కోట్లు అవసరముంటే కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించడం ఎంత వరకూ సమంజసమన్నారు. విశాఖకు తాగునీరు అందించే రైవాడ ప్రాజెక్టు కు 75 లక్షలు అవసరమైతే రూ. 6 లక్షలు మాత్రమే బడ్జెట్ లో కేటాయించారన్నారు.  ఈ కేటాయింపులు  కేవలం కాంట్రాక్టర్లను మెయిన్ టెయిన్ చేయడానికే సరిపోతుందని ప్రసాద రెడ్డి ఎద్దేవా చేశారు.
Back to Top