ఎన్నికుట్రలు చేసినా..రాజ్యసభను లాక్కోలేరు

అవినీతి బాబును అసహ్యించుకుంటున్నారు
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
హోదా సహా అన్నింటినీ ఢిల్లీకి తాకట్టు పెట్టారు
మీ లక్ష 40 వేల కోట్ల అవినీతిలో రూ.లక్ష ఖర్చుపెట్టినా అడ్డుకోలేరు
బాబు ఇకనైనా తన మైండ్ సెట్ మార్చుకోవాలిఃశ్రీకాంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: చంద్రబాబు ఏపీలో రాచరిక పాలన సాగిస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. బాబు అవినీతి పాలనను చూసి ప్రపంచమంతా అసహ్యించుకుంటోందని  శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల ప్రలోభాలు, కొనుగోళ్లు, వలసలను ప్రవాస భారతీయులు తీవ్రంగా తప్పుబడుతున్నారని తెలిపారు. ఏపీలో చోటు చేసుకోంటున్న పరిణామాలపై యూఎస్లోని తెలుగు వారు తీవ్రంగా కలత చెందుతున్నారని  చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాష్ట్రాన్ని అవినీతి మయం చేసిన చంద్రబాబును ప్రతి ఒక్కరూ ఛీదరించుకుంటున్నారన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. 

రాజధాని వ్యవహారాన్ని చంద్రబాబు కుటుంబ వ్యవహారంలా భావిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గొప్పలు చెప్పడం తప్ప చంద్రబాబు ప్రజలకు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు... అధికారులు ప్రజాస్వామ్యబ‌ద్ధంగా ప‌ని చేసుకోకుండా అడ్డుప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ప్రజాస్వామ్య బ‌ద్ధంగా ప‌ని చేస్తున్న అధికారుల‌పై బెదింరిపుల‌కు పాల్ప‌డేవారిని శిక్షించాల్సింది పోయి బాబే ద‌గ్గ‌రుండి మరీ ప్రోత్స‌హిస్తున్నార‌ని కోపోద్రిక్తులయ్యారు. 

రుణమాఫీ ఏమైంది బాబు..
ఎన్నిక‌ల‌కు ముందు రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పొందుప‌ర్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ముఖం చాటేశార‌ని మండిపడ్డారు. డ్వాక్రా మ‌హిళ‌ల రుణాలు, ఇంటికో ఉద్యోగం గంగ‌లో క‌లిపేశారని  శ్రీ‌కాంత్‌రెడ్డి ఫైరయ్యారు.  ఇచ్చిన హామీల‌ేమయ్యాయని  పాత్రికేయులు ప్ర‌శ్నిస్తే...మీకు బుద్ధి  లేదా... మీరు మైండ్ సెట్ మార్చుకోవాలి అంటూ బాబు విలేకరులను సంబోధించడం దారుణ‌మ‌న్నారు.  

నేర్చుకోవాల్సింది బాబే..
బాబు చేసే త‌ప్పుడు విధానాల‌పై బాధ్య‌త క‌లిగిన ప్ర‌తిప‌క్ష పార్టీగా  ప్రశ్నిస్తే..తమ పార్టీపైనా బాబు ఎదురుదాడికి దిగుతున్నారని, విచ‌క్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌జేయ‌కుండా కేవ‌లం ప్ర‌చార అర్భాటాల‌కే బాబు ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమ‌ర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు అమలు చేయడం లేదన్నారు.  ప్రత్యేకహోదా సహా అన్నింటినీ ఢిల్లీకి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.  బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను బలిపశువులను చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. వాస్త‌వానికి క్ర‌మ‌శిక్ష‌ణ నేర్చుకోవాల్సింది మీడియా సోద‌రులు, ప్ర‌తిప‌క్షం కాద‌ని.. బాబేన‌ని చురక అంటించారు. ప్ర‌జాస్వామ్య హక్కులు కాలరాయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. 

ఎన్నికుట్రలు చేసినా రాజ్య‌స‌భ మాదే..
టీడీపీ ఎన్ని ర‌కాలుగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీపై కుట్ర‌లు ప‌న్నినా  రాజ్య‌స‌భ‌ సీటును అడ్డుకోలేరని శ్రీ‌కాంత్‌రెడ్డి తెలిపారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి రాజ్యసభకు వెళ్లడం తధ్యమన్నారు.  లక్షా 40 వేల కోట్ల‌ అవినీతి పాల్పడిన టీడీపీ సర్కార్...దాంట్లో లక్ష కోట్లు ఖర్చుపెట్టినా  ఏం చేయలేదని తూర్పారబట్టారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్య‌స‌భ స్థానం ద‌క్కుతుంద‌ని తేల్చిచెప్పారు. ఇప్ప‌టికైనా బాబు అంద‌రినీ గౌర‌వించే విధానం నేర్చుకోవాల‌ని సూచించారు. కొంత‌మంది ఎమ్మెల్యేలు ప్ర‌లోభాల‌తో పార్టీలు మారినా.... విలువలు, విశ్వసనీయత తమ  హోదాగా బతుకుతున్న ఎమ్మెల్యేలు వైయ‌స్సార్ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నార‌న్నారు. గ‌తంలో తాము వైయస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పార్టీలో చేర‌డానికి వెళ్తే ...రాజీనామా చేసిన అనంత‌రం పార్టీలో చేరాల‌ని సూచించారని గుర్తు చేశారు. అప్పుడు తాము ప‌ద‌వికి ఆశ ప‌డ‌లేద‌ని, పార్టీలో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డి వచ్చి రాజీనామా చేసి తిరిగి గెలుపొందామ‌ని ఆయ‌న వివ‌రించారు. ప్రతి ఎమ్మెల్యే ఇదే ర‌కంగా ఉండాల‌ని ప్ర‌జ‌లు చెబుతున్నార‌న్నారు. 
Back to Top