ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న స్పీకర్ పై అవిశ్వాసం

హైదరాబాద్ః సభలో పార్టీలకతీతంగా తండ్రిపాత్ర పోషించాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ...ప్రతిపక్షం గొంతు నొక్కే రీతిలో అధికారపార్టీకి కొమ్ముకాస్తూ రక్షణకవచంలా ఉంటున్నాడని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రికి మద్దతు పలుకుతూ స్పీకర్ కోడెల నిరంకుశ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తకు, స్పీకర్ కు తేడాలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.  

ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా  ప్రతిపక్ష నాయకుని ప్రసంగానికి అడుగడుగునా అడ్డుతగిలినా...స్పీకర్ అడ్డుచెప్పకపోవడం దారుణమన్నారు. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్ష నేతను ఎన్ని తిట్టినా, దుర్భషలాడినా స్పీకర్ కోడెల వింటాడు గానీ ఖండించడని చెప్పారు. ఉన్నతమైన స్పీకర్ స్థానంలో ఉండి, రాష్ట్ర ప్రజల మనోభావాలను కాలరాస్తూ.... విలువలకు తిలోదకాలు ఇస్తున్నందునే కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం పెడుతున్నామన్నారు. సభా సంప్రదాయాలను మంటగల్పుతున్న అధికారపార్టీ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని కోటంరెడ్డి చెప్పారు.  

Back to Top