స్పీకర్ పై వైఎస్సార్ సీపీ అవిశ్వాసం నోటీస్

హైదరాబాద్ః  అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స‌భ‌లో వ్య‌వ‌హరించిన తీరు దారుణ‌మ‌ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సుజ‌య‌కృష్ణ‌ రంగారావు అన్నారు. స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. పార్టీల‌క‌తీతంగా వ్య‌వ‌హరించాల్సిన స్పీక‌ర్ అధికార ప‌క్షానికి తొత్తుగా మారారని ఆరోపించారు. ఎన్నో సంద‌ర్భాల్లో టీడీపీ స‌భ్యుడిగా వ్య‌వ‌హరించిన తీరు దురదృష్టకరమన్నారు.  అన్ని విధాలుగా గౌర‌వంతో మా నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌, ఎమ్మెల్యేలు కోడెలను సభాపతిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు స‌హ‌క‌రించార‌న్నారు. 

స్పీక‌ర్‌ స్థానంపై  వైఎస్సార్‌సీపీకి ఎంతో గౌర‌వం ఉందని సుజయకృష్ణ తెలిపారు.  కోడెల సభలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును తాము తప్పుబడుతున్నామన్నారు.  గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ఎమ్మెల్యే రోజాపై స్పీకర్ వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజాను సభా వ్య‌వ‌హారాల‌కు వ్య‌తిరేకంగా... ఏడాది పాటు స‌స్పెండ్ చేయించే అధికారం శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు లేద‌న్నారు. 

తాజా ఫోటోలు

Back to Top