అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు అనుమ‌తించాలి

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై తాము ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పీక‌ర్‌ను కోరారు. అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 15న లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విష‌యం విధిత‌మే . ఈ మేర‌కు తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ గురువారం వివిధ రాజకీయ పార్టీలకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. తమ న్యాయమైన డిమాండ్‌కు అండగా నిలవాలని అభ్యర్థించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభు త్వం ప్రత్యేక హోదాను నిరాకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6వ తేదీన తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైయ‌స్ జగన్‌ పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top