అవిశ్వాస తీర్మాన అంశాన్ని ప్రస్తావించిన వైఎస్ జగన్

హైదరాబాద్) శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం కార్యకలాపాలు మొదలవుతున్న
సమయంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అవిశ్వాస తీర్మాన
అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ శాసనసభ్యులు నిబంధనల ప్రకారం
అవిశ్వాసం మీద శాసనసభ కు నోటీసు సమర్పించారు. ఇది అందినట్లు స్పీకర్ కార్యాలయ
వర్గాలు ధ్రువీకరించాయి. దీంతో దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం, జీరో అవర్ తర్వాత ఈ అంశాన్ని చేపడదామని స్పీకర్ కోడెల
శివప్రసాద్ వెల్లడించారు. ఆ సమయంలో బీఏసీ సమావేశం నిర్వహించి, తదనుగుణంగా అవిశ్వాస
తీర్మానం మీద చర్చ చేపట్టే అవకాశం ఉంది. 

Back to Top