స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్)
అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గా కోడెల శివప్రసాద్ తీరు మీద విపక్ష వైఎస్సార్సీపీ
లోతుగా చర్చించింది. ముఖ్యంగా ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం విషయంలో స్పీకర్ ప్రవర్తించిన
తీరు మీద సీనియర్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన పదజాలంతో అధికార పక్ష
సభ్యులు వైఎస్ జగన్ ను తిట్టిస్తుంటే అడ్డుకోక పోవటంపై ఆందోళన వ్యక్తం అయింది.
అంతేగాకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు మైక్ ఇచ్చినట్లే ఇచ్చి, వెంటనే కట్ చేసి,
మంత్రులు టీడీపీ సభ్యుల చేత తిట్టించే కార్యక్రమం మీద ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  దీంతో ఆయన మీద అవిశ్వాస తీర్మానం తేవాలని
నిర్ణయించారు.

Back to Top