ఆరో సారి అవిశ్వాస తీర్మానం నోటీసు

ఢిల్లీ: ప్రత్యేక హోదాపై లోక్‌సభలో చర్చ జరిగే వరకు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తూనే ఉంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై చర్చ జరిగేందుకు వరుసగా ఐదు రోజుల పాటు వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూనే ఉంది. కాగా సభ ఆర్డర్‌లో లేనందున ఓటింగ్‌ జరగడం లేదని స్పీకర్‌ దాటవేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం కూడా ఆరోసారి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అవిశ్వాస నోటీసులు లోక్‌సభ సెక్రటరీకి అందజేశారు. శుక్రవారం నాటి సభా కార్యక్రమాల అజెండాలో అవిశ్వాస తీర్మానాన్ని పొందుపరచాలని  ఆయన విజ్ఞప్తి చేశారు.


Back to Top