కేంద్రంపై మళ్లీ అవిశ్వాస నోటీసు

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోలీసులు అందజేశారు. ప్రత్యేక హోదాపై లోక్‌సభలో చర్చ జరిగే వరకు వదిలిపెట్టమని, చర్చ జరిగే వరకు నోటీసులు ఇస్తూ ఉంటామన్నారు. చర్చ జరిగితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఏపీకి న్యాయం జరగాలనేదే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తపన అన్నారు. 
 

Back to Top