ప్ర‌భుత్వం పై అవిశ్వాస తీర్మానం నోటీసు

హైద‌రాబాద్‌) రాష్ట్ర ప్ర‌భుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాల‌ని వైఎస్సార్సీపీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని కలసి నోటీసులు అందజేశారు. రూల్ నెం. 75 కింద ఈ నోటీసు అంద‌చేశారు. ఆ త‌ర్వాత  మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా నోటీసులు అందజేసినట్టు చెప్పారు. రాజ‌ధాని భూ దందాలు, అవినీతి కుంభ‌కోణాల రీత్యా ప్ర‌జ‌లు ఈ ప్ర‌భుత్వం మీద విశ్వాసం కోల్పోయారని వివ‌రించారు. 
Back to Top