స్పీకర్ మీద అవిశ్వాసం తెచ్చే దిశగా వైఎస్సార్సీపీ

శాసనసభలో స్పీకర్
అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అవిశ్వాస తీర్మానం తెచ్చే దిశగా వైఎస్సార్సీపీ
యోచిస్తోంది. శాసనసభ శీతాకాల సమావేశాల్లోనే కాకుండా మొదట నుంచి స్పీకర్ గా కోడెల
శివప్రసాద్ రావు వ్యవహార శైలిని ప్రజాస్వామ్య వాదులు తప్పు పడుతున్నారు. ముఖ్యంగా
ఈ సెషన్ లో సెక్సు రాకెట్ మీద చర్చను జరపనీయకుండా అడ్డుకోవటం తో పాటు దీని మీద
ప్రశ్నించిన వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యే రోజా ను ఏడాది పాటు సస్పెండ్ చేయటం
వివాదాస్పదం అయింది. ఈ అధికారం లేదని వైఎస్సార్సీపీ స్పీకర్ ద్రష్టికి తీసుకొని
వచ్చినా, కానీ పట్టించుకోక పోవటంతో వైఎస్సార్సీపీ సభ నుంచి బాయ్ కాట్ చేసింది.
అనంతరం సీనియర్ నేతల భేటీలో అవిశ్వాసం తీర్మానం తెచ్చే అంశం తెర మీదకు వచ్చింది. 

Back to Top