రైతుల పక్షాన ఆలోచించే వారు లేరు.

హోదాను తీసుకురాకుండా అన్యాయం చేశారు

గోపాలపురం సభలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్
రెడ్డి

 

రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతుల
గురించి ఆలోచించే వారే కరువయ్యారనీ, గిట్టుబాటు ధరలు లభించకున్నా చర్యలు తీసుకోవడం
లేదని, కేవలం ఎన్నికలప్పుడే చంద్రబాబుకు రైతులు, ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయని
ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నీరు ప్రగతి చెట్టు
కార్యక్రమాన్ని గ్రామాలను దోచుకునేందుకే చేపట్టారన్నారు. ప్రత్యేక హోదా తీసుకుని
రాకుండా రాష్ట్రానికి చంద్రబాబు తీరని అన్యాయం చేశారన్నారు.  పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం
నల్లజెర్ల గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు వైఫల్యాలను,
పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టారు.

గోపాలపురం నియోజకవర్గంలో అడుగుపెట్టగానే రైతాంగం
పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ,
తమ భూములకు నీళ్లురావడం ఆలస్యమైపోతోందన్న ఆవేదన వ్యక్తం చేశారని జగన్ వివరించారు.  దివంగత
వైయస్ ఆర్ హయాంలోనే పోలవరం కుడికాలువ పనులు 90 శాతం పూర్తి అయ్యాయనీ, ఎడమ కాలువ
పనులు 60 శాతం పూర్తి అయ్యాయని మిగిలిన పనులు పూర్తి చేయడంలో పూర్తిగా నిర్లక్షం
వహిస్తున్నారని రైతులు తనతో గోడు వెలిబుచ్చుకున్నట్లు చెప్పారు. అసలు పోలవరం
ప్రాజెక్టు లో 36 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరగాల్సి ఉండగా ఇంతవరకు 6
లక్షల క్యూబిక్ మీటర్ల పనులు కూడా జరగలేదని, రోజుకు సగటున 3 వేల క్యూబిక్ మీటర్ల
పని కూడా కావడం లేదని, ఆదే పొరుగున ఉన్న తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో
రోజుకు సగటున 22 వేలక్యూబిక్ మీటర్ల కాంక్రీటుతో పనులు అత్యంత వేగవంతంగా
జరుగుతున్నాయని వివరించారు.

అసలు కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టును రాష్ట్ర
ప్రభుత్వమే చేపట్టాలని చంద్రబాబుకు ఎవరు చెప్పారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారనీ,
పోలవరం ప్రాజెక్టు పనులధరలను ఇష్టారాజ్యంగా పెంచుతూ కాంట్రాక్టర్ల పేరుతో
అవినీతికి పాల్పడుతున్నారని వైయస్ జగన్ అన్నారు. అంతే కాకుండా నామినేషన్ పద్దతిన  తన బినామీలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారనీ,
స్వయంగా రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడే ఈ కాంట్రాక్టులు
చేస్తున్నారన్నారు. చంద్రబాబు అవినీతి వల్లే రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న అభిప్రాయం రైతుల్లో ఉందన్నారు. చంద్రబాబు నాయుడికి
ఎన్నికల సమయంలోనే రైతులు , ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయని గతంలో 9 ఏళ్లపాటు
నిద్రపోయిన చంద్రబాబు గోపాలపురం పరిసరాల్లోనే 2003 ఎన్నికలకు ముందు మూడు
ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు చేసి గాలికి వదిలేశారని, వాటిని దివంగత వైయస్ ఆర్ హయాంలో
దాదాపుగా పూర్తి చేస్తే, మిగిలిన చిన్న పనులను కూడా పూర్తి చేయడం లేదన్నారు.
తాడేపూడి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు, కొవ్వాడ ఎల్ అండి డి పేట రిజర్వాయరు,
ద్వారకా తిరుమల గిరియమ్మ ప్రాజెక్టుల స్థితిగతులను జగన్ ఈ సందర్భంగా
ప్రస్తావించారు. ద్వారకా తిరుమల ప్రాజెక్టుకైతే 2010 లోనే ట్రయల్ రన్ లు చేసినా
ఇప్పటికీ రైతులకు నీళ్లవ్వడం లేదంటే నిర్లక్షానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటూ
జగన్ ప్రశ్నించారు.

తన పాదయాత్ర పొడవునా కనిపిస్తున్న వివిధ రకాల
పంటలు పామాయిల్, పొగాకు, మొక్కజొన్న , వరి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు రాని
వైనంపై కూడా రైతులు ఆవేదన చెందుతున్న తీరును వివరిస్తూ, పామాయిల్ విషయంలో తెలంగాణ  కంటే దాదాపు వెయ్యి రూపాయలు తక్కువగా వస్తున్నా
పట్టించుకున్న వారే లేరన్నారు. ఇందుకు కారణం ప్రభుత్వ రంగ సంస్థలే అన్న విషయం
తెలిసినా ఈ ముఖ్యమంత్రికి స్పందించాలన్న బుద్ది జ్ఞానం లేవని తీవ్రంగా మండిపడ్డారు.
అలాగే పొగాకు విషయంలో కూడా ప్రతి ఏటా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా తాను ధర్నాలు
చేస్తేనే కొద్దోగొప్పో రైతులకు న్యాయం చేస్తున్నారనీ , ఇప్పుడు కూడా కొనుగోళ్లు ప్రారంభమై
నెలరోజులు గడుస్తున్నాయనీ, రైతులకు గిట్టుబాటు ధరలు రాకున్నా ప్రభుత్వం నిమ్మకు
నీరెత్తినట్లుగా ఉందన్నారు.

పొగాకు రైతులు ఎక్కువంటూ.ఇక్కడ కొనుగోళ్లు
మొదలెట్టి నెలరోజులైనా 145 కు మిచిరావం లేదంటే రైతన్నల బాధలు పట్టించుకోవాలన్న
స్పృహ లేకపోతే ఏమనాలి. ప్రతిపక్షనాయకుడిగా తాను నిత్యం ధర్నాలు చేయాల్సిన
దుస్థితి ఉందని, వారిని నట్టేట ముంచడంలోనే ఆక్తి
చూపుతోంది. దళారీల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. వరి విషయంలో కూడా రైతుల పరిస్థితి
ఇలానే ఉందనీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాకుండా దళారీ నాయకుడిగా వ్యవహరిస్తుండటంవల్లనే
దారుణమైన పరిస్థితులకు కారణమని జగన్ ధ్వజమెత్తారు. నీరు చెట్టు పేరుతో జరుగుతున్న
అవినీతి చాలని ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో స్పష్టంగా చెప్పడానకన్నారు. గోపాలపురం
లోనే తవ్వని చెరువులకు బల్లులు తీసుకోవడమే కాకుండా, మట్టి తవ్వడానికి డబ్బులు తీసుకుంటూ,
మళ్లీ ఆ మట్టిని అమ్మతూ కూడా విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు పైనుంచి కింది దాకా
దేనిని వదలకుండా దోచుకుంటున్నారనీ, గ్రామాల్లో ఈ పనిని జన్మభూమి కమిటీలనే తన
మాఫియాకు అప్పగించారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ మాఫియా ముఠాలు మట్టి, ఇసుకతోపాటు,
ఆఖరికి సామాన్యుడి మరుగుదొడ్ల నిర్మాణంలోని అక్రమాలకు తెగబడ్డారన్నారు.

ఈ దుర్మార్గపు పాలనకు నిదర్శనమిదిగో...

దొరసాని ప్రాంతానికి చెందిన  వికలాంగుడైన నాగరాజుకు మహానేత వైయస్ ఆర్ హయాం
నుంచే ఫించను లభించేందనీ, కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిన జన్మభూమి కమిటీల
పుణ్యమా అని ఆ ఫించన్ ను కట్ చేశారనీ, దాంతో తీవ్రమైన ఆర్థిక బాధలకు గురైన నాగరాజు
ఆత్మహత్య చేసుకున్నారంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలన్నారు. ఈ
సందర్భంగా చంద్రబాబు రుణమాఫీ , డ్వాక్రా రుణమాఫీ , నిరుద్యోగులకు ఉద్యోగాలు,
నిరుద్యోగ భృతి తదితర అంశాల్లో చేసిన మోసాన్ని ప్రజల కళ్లకు కట్టినట్లు వివరించారు.
 సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో
ఎలాంటి నాయకులు కావాలో ఒకసారి ఆలోచించండి. అబద్దాలు చెప్పేవారు, మోసం చేసేవారు  నాయకుడిగా కావాలా ఒకసారి ఆలోచించుకోవాలంటూ
ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్బంగా తాము అధికారంలోకి వస్తే మహిళల కోసం
చేపట్టనున్న కార్యక్రమాలను జగన్ వివరించారు. 

Back to Top