వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబేది బాబూ..!

హైదరాబాద్)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెడుగుడు
ఆడుకొన్న సంగతి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా
ప్రభుత్వం చేసిన అవినీతి పనుల్ని ఆధారాలతో సహా అసెంబ్లీ లో కడిగేయటం మీద చర్చించుకొన్నారు.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ దీని మీద అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు.

‘‘ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేక
ఇబ్బంది పడ్డారు. వైఎస్ జగన్‑ను టార్గెట్ చేయడానికి మొత్తం మంత్రివర్గాన్ని
వాడుకుంటున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వైఎస్ జగన్ ఒక్కరే కాదు.. ఇతర
విపక్ష పార్టీ నేతలందరూ దూరంగా ఉన్నారు.’’ అని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం
చంద్రబాబుని ఎవరూ నమ్మటం లేదని వ్యాఖ్యానించారు. విదేశాలకు తిరగటం తప్ప
పెట్టుబడులు పెద్దగా రావటం లేదని పేర్కొన్నారు.

‘‘ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మాల, మాదిగల మధ్య చంద్రబాబు
చిచ్చుపెట్టారు. ఇప్పుడు ఏపీలో మరోసారి కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. కాపులు, బీసీల మధ్య పెడుతున్న చిచ్చు
తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటుంది. హామీలు నెరవేర్చకపోవడంతోనే ఏపీలో కాపులు ఉద్యమ
బాట పట్టారు. బడ్జెట్‑లో కాపులు కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తారనేది
అనుమానమేనని' శ్రీనివాస్ యాదవ్
దుయ్యబట్టారు.

 

Back to Top