తనపై ఏ చర్య తీసుకోవడానికి వీల్లేదు

  • తాను ఏ తప్పు చేయలేదు
  • చంద్రబాబువి కక్షసాధింపు చర్యలు
హైదరాబాద్ః అసెంబ్లీలో వైయస్ జగన్,  ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని అధికార టీడీపీ టార్గెట్ చేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ ముందు కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మూడు రోజుల సంఘటనల వీడియోలు చూపించారని,  తాను ఎక్కడా కూడా ఆ విజువల్స్ లో లేనని కొడాలి నాని తెలిపారు.  హోదా ఇవ్వడం లేదు ప్యాకేజీ ఇస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 7వ తేదీ అర్థరాత్రి ప్రకటన చేయడం, బాబు దాన్ని స్వాగతించడాన్ని నిరసిస్తూ 8వ తేదీ స్పీకర్ పోడియంను చుట్టుమాట్టామని కొడాలి నాని వివరించారు. హోదాపై చర్చ జరగాలని తాము పట్టుబడితే చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే తన పేరు చేర్చారని కొడాలి నాని ఫైర్ అయ్యారు.  

తాను  ఏ తప్పు చేయలేదు కాబట్టి తనపై ఏ చర్య తీసుకోవడానికి వీల్లేదని కమిటీ ముందు స్పష్టంగా చెప్పానని కొడాలినాని తెలిపారు. సస్పెండ్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే నోటీసులిచ్చినట్లు కనబడుతోందని అన్నారు. చివరిదాకా వైయస్ జగన్ తోనే ఉంటానని విలేకరులు అడిగిన ప్రశ్నకు కొడాలి నాని బదులిచ్చారు. పార్టీ నుంచి ఒకరు ఇద్దరు పోయినంత మాత్రాన పెద్దగా పట్టించుకోనక్కర్లేదని అన్నారు. చాలా మంది పార్టీలోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారని చెప్పారు. 
Back to Top