నిరుపేదల దేవుడు మహానేత వైయస్

పశ్చిమ గోదావరి జిల్లా:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి నిత్యం ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి నిరుపేదలకు దేవుడయ్యారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెల్లంవారిగూడెంలో మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నైవేద్యంగా నూతన వస్త్రాలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం మహానేత పరితపించటం వల్లే ప్రజలు దేవుడిగా భావిస్తున్నారన్నారు. వైయస్ఆర్ పాలనలో ప్రతి పండుగకు తెలుగులోగిళ్లు ఆనందంగా ఉండేవన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితిలో లేరన్నారు.
మహానేత తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహనరెడ్డి కూడా అనతికాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందారని అన్నారు. అందువల్లే కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు, కుతంత్రాలు చేసి ఆయనను జైలు పాలుచేశాయని విమర్శించారు.  శ్రీ జగన్మోహనరెడ్డి జైలులో ఉన్నా, జనం మధ్యనే ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారన్నారు,

Back to Top