నిడదవోలులో నేడు షర్మిల బహిరంగ సభ

నిడదవోలు (ప.గో.జిల్లా),

2 జూన్‌ 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 167వ రోజు ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా నిడదవోలు గణేష్‌ చౌక్‌లో జరిగే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల పార్టీ శ్రేణులు, వైయస్‌ అభిమానులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

కాగా, ఆదివారంనాడు శ్రీమతి షర్మిల మొత్తం 13.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. నిడదవోలు మండలం కోరుపల్లి అడ్డరోడ్డు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కలవచర్ల, డి.ముప్పవరం, సమిశ్రగూడెం, నిడదవోలు, బ్రాహ్మణగూడెం మీదుగా చాగల్లు మండలం గరప్పాడు చేరుతుందని వారు పేర్కొన్నారు

Back to Top