మ‌హానాడులో చంద్ర‌బాబు కొత్త అబ‌ద్దాలు

అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడులో కొత్త అబద్ధాలు చెబుతున్నారని  అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. సొంత డబ్బా కోసం, పెదబాబు, చినబాబును పొగి డేందుకే మహానాడును పరిమితం చేశారన్నారు.    వీరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రెండేళ్లపాలనపై చర్చ జరపాలన్నారు.  సర్వేల పేరుతో కోట్ల రూపాయలు దండుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన  దీక్షలను చంద్రబాబు భజన బృందం ఎద్దేవా చేయడం సిగ్గుచేటన్నారు. పైగా మహానాడులో దీనిపై తీర్మానం చేయడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర  ఆర్థిక  పరిస్థితి బాగాలేదంటూనే సివిల్ సప్లయ్, ఇరిగేషన్ టెండర్లు, చంద్రన్నకానుక  పేరుతో రూ. వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

కేవలం రూ. 500 కోట్లతో డిస్ట్రిబ్యూటరీ, చెరువుల ద్వారా హంద్రీ-నీవా నీటిని జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం ఉందన్నారు.  అయితే 1163 చెరువులకు హంద్రీ-నీవా పథకానికి  లింకేజీ చేసే ఊహాజనిత ప్రాజెక్ట్ గురించి జిల్లా మంత్రులు మాట్లాడడం విడ్డూరమన్నారు.నీటిని జిల్లాను దాటించే విధంగానే పనులు జరుగుతున్నాయన్నారు.

తాజా వీడియోలు

Back to Top