వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు

హైదరాబాద్ః రంగారెడ్డి జిల్లాలో వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి.  రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు మతీన్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు వైయస్సార్సీపీలో చేరారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శంషాబాద్ కు చెందిన సయ్యద్ నౌషిల్, అబ్దుల్లా మతీన్,  ముజీబ్, ఇమ్రాన్, గౌస్ తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాశ్, బొడ్డు సాయినాథ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 
Back to Top