వైయ‌స్సార్‌సీపీలోకి భారీ చేరిక‌లు

ప్ర‌త్తిపాడు(రౌతుపాలెం):  తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం
రౌతుపాలెం గ్రామానికి చెందిన 50 మంది వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కందా రాజా, ప్ర‌కాష్‌, స‌తీష్‌, నారాయ‌ణ‌, స‌త్తిబాబు, నాగ‌సూరి, పెద‌కాపు, నానీ, ఉమ్మ‌డి రాంబాబు త‌దితరులు వైయ‌స్సార్
కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ ప‌ర్వ‌త శ్రీ‌పూర్ణ చంద్ర‌ప్ర‌సాద్
ఆధ్వ‌ర్యంలో పార్టీలో చేరారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్
రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేయాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌తి ఒక్క‌రూ వైయ‌స్సార్
కాంగ్రెస్ పార్టీ కోసం ప‌ని చేయాల‌ని సూచించారు. అనంత‌రం వారికి పార్టీ కండువా క‌ప్పి
పార్టీలోకి ఆహ్వానించారు. 

 

Back to Top