వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూత‌న నియామ‌కాలు

విజ‌య‌వాడ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ప‌లు నియామ‌కాలు చేశారు. విజయవాడ నగరపార్టీ అధ్యక్షునిగా ఉన్న వంగవీటి రాధాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయ‌న‌ స్థానంలో విజయవాడ నగర అధ్యక్షునిగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నియమించారు. శ్రీనివాస్‌కు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం సింగిల్‌ కో ఆర్డినేటర్‌గా కూడా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇదే నియోజకవర్గం సమన్వయకర్త షేక్‌ ఆసిఫ్‌ను రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించారు. తూర్పుగోదావరి జిల్లా గ్రేటర్‌ రాజమండ్రి వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడిగా శాసనమండలి మాజీ సభ్యుడు కందుల దుర్గేష్‌ను నియమించారు.

Back to Top