వైయస్సార్సీపీలో చేరిన 11వ వార్డు ప్రజలు

క‌ర్నూలు:  ప్ర‌జ‌లు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నార‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త హ‌ఫీజ్‌ఖాన్ అన్నారు. 11వ వార్డులోని ఎర్ర‌బురుజు వీధికి చెందిన కుమార్‌, జేమ్స్‌, తిల‌క్‌, హ‌నుమంతు, మ‌హేష్‌తో పాటు మ‌రో 50 మంది స్థానికులు హ‌ఫీజ్‌ఖాన్ స‌మ‌క్షంలో వైయ‌స్సార్‌సీపీలో చేరారు. ఆయ‌న వారికి  కండువాలు వేసి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు పి.జి.న‌ర‌సింహులు యాద‌వ్‌, పార్టీ నాయ‌కులు డి.కె.రాజ‌శేఖ‌ర్‌, సురేష్‌తో పాటు ప్ర‌సాద్‌, కృష్ణ‌బాబు, న‌వీన్‌, తిరుపాల్ బాస్క‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 
Back to Top