వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు

హైదరాబాద్: వైయస్సార్సీపీలో భారీ చేరికలు జరిగాయి. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు మేడిశెట్టి యాదయ్య, ఐతరాజు రాజు, కత్తుల దిలీప్, కాంగ్రెస్ నాయకులు మాచర్ల దశరథ్, మానిర్ల జానీ తదితరులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్లగొండ జిల్లా పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు మహ్మద్ ఫయాజ్ ఆధ్వర్యంలో వారంతా వైయస్సార్‌సీపీలో చేరారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన న్యాయవాది ఫరీద్, మహ్మద్ అక్బర్, అమృతప్ప, ప్రకాష్, ఎండీ లాల, ఎండీ సిరాజ్ తదితరులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభుకుమార్ ఆధ్వర్యంలో వారు వైయస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌రెడ్డి, ఆ జిల్లా యూత్ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top